News August 31, 2024
మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇవి తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్, మధురై-బెంగళూరు, యూపీలోని మీరట్-లక్నో మధ్య నడవనున్నాయి. ఇందులో రెండు రైళ్లు దక్షిణ రైల్వే జోన్‌లోనివి కావడం విశేషం.
Similar News
News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.
News February 16, 2025
తండ్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్: బ్రహ్మానందం

తండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలని నటుడు బ్రహ్మానందం ‘బ్రహ్మా ఆనందం’ ప్రెస్‌మీట్‌లో విజ్ఞప్తి చేశారు. ‘20-25 ఏళ్లు దాటాక పిల్లల్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలన్న ఆలోచన రాకూడదు. రెక్కలు వచ్చిన పక్షులు అవే ఎగురుతాయి. ఎగరటాన్ని అలవాటు చేయాలి తప్ప ఇంత వరకే రెక్క ఉండాలంటూ నిబంధనలు పెట్టడం వల్ల మరింత గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. మా పిల్లల్ని నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు’ అని వెల్లడించారు.
News February 16, 2025
హర్మన్‌ప్రీత్ అరుదైన ఫీట్

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. హర్మన్ కన్నా ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి చేరుకున్నారు.