News August 31, 2024

అర్ధరాత్రి తీరం దాటనున్న తుఫాన్

image

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అది తుఫానుగా బలపడి ఇవాళ అర్ధరాత్రికి శ్రీకాకుళం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉధృతంగా ఈదురుగాలులతోపాటు భారీ వానలు పడనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి గడిస్తే చాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Similar News

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 14, 2025

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

image

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.

News March 14, 2025

WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

image

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.

error: Content is protected !!