News August 31, 2024
అర్ధరాత్రి తీరం దాటనున్న తుఫాన్

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అది తుఫానుగా బలపడి ఇవాళ అర్ధరాత్రికి శ్రీకాకుళం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉధృతంగా ఈదురుగాలులతోపాటు భారీ వానలు పడనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి గడిస్తే చాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
Similar News
News February 13, 2025
మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
News February 13, 2025
భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!

భార్యల వేధింపులతో భర్తలు <<15216504>>బలవన్మరణానికి<<>> పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నాం: MLC కవిత

తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల్ని పింక్ బుక్‌లో నోట్ చేసుకుంటున్నామని BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా విమర్శలకు కూడా CM భయపడుతున్నారు. పోస్టు పెట్టిన తర్వాతి రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు. మీ లెక్కలన్నీ తేలుస్తాం’ అని హెచ్చరించారు.