News September 1, 2024

BIG ALERT: OnePlus ఫోన్ వాడుతున్నారా?

image

OnePlus 9, 10 మోడల్ ఫోన్లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే మదర్‌బోర్డ్ ప్రాబ్లమ్ వస్తోందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి, సిమ్ కార్డులు పని చేయట్లేదంటున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవద్దని కొందరు టెక్ నిపుణులు సలహాలిస్తున్నారు. దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. మరి మీకూ ఈ సమస్యలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి.

Similar News

News February 2, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: అడిగిన జీతం ఇవ్వని గర్వంతో కూడిన యజమాని వద్ద ఉండటం కంటే వేగంగా పోయే ఎద్దులను నాగలికి కట్టుకుని వ్యవసాయం చేయడం మంచిది.

News February 2, 2025

ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

image

✒ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
✒ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
✒ 1940: రచయిత ఎస్వీ రామారావు జననం
✒ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
✒ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
✒ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం

News February 2, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.