News February 2, 2025

ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

image

✒ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
✒ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
✒ 1940: రచయిత ఎస్వీ రామారావు జననం
✒ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
✒ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
✒ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం

Similar News

News February 14, 2025

పెన్షన్లు తెచ్చిన సీఎం ఈయనే

image

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి

News February 14, 2025

యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

image

AP: అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

News February 14, 2025

మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

image

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.

error: Content is protected !!