News September 2, 2024

PHOTOS: బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

image

నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో సినీరాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, గోపీచంద్, కన్నడ నటులు శివరాజ్ కుమార్, ఉపేంద్రతో పాటు టాలీవుడ్ దర్శకులు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News

News February 2, 2025

RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్‌లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

News February 2, 2025

ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ

image

రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.

News February 2, 2025

టెన్త్ విద్యార్థులకు ‘స్నాక్స్’ ప్రారంభం

image

TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్‌ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, ఉల్లిపాయ పకోడి రోజుకొక రకం ఇవ్వనున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు స్నాక్స్ అందిస్తున్నారు.