News February 2, 2025

ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ

image

రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.

Similar News

News April 18, 2026

భారత నౌకలపై IRGC కాల్పులు!

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.

News April 18, 2026

GOOD NEWS: ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్

image

AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ప్రకటించింది. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఆ సబ్జెక్ట్ రాయొచ్చని, ప్రతి పేపర్‌లో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామంది. దీనివల్ల మంచి కాలేజీల్లో సీటు రాకపోవడం, ఒత్తిడికి లోనవడం లాంటివి తగ్గే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.

News April 18, 2026

చెన్నైకి ఆరెంజ్ ఆర్మీ షాకిస్తుందా?

image

ఐపీఎల్‌లో CSKపై SRH రికార్డు పేలవంగా ఉంది. ఇరు జట్లు 22 సార్లు తలపడగా ఆరెంజ్ ఆర్మీ 7, చెన్నై 15 సార్లు గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక స్కోర్ రికార్డు సీఎస్కే పేరిట (223/3) ఉంది. SRH 2024లో అత్యధికంగా 192 రన్స్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో 2018 నుంచి చెన్నై గెలవలేదు. ఈసారి CSKతో పోలిస్తే సన్‌రైజర్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.