News September 2, 2024

బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: చిరంజీవి

image

తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ ప్రత్యేకత చాటుకున్నారని చిరంజీవి అన్నారు. ‘నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం సమరసింహారెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని కోరిక. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండదు. అందరితో కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. మేమంతా ఒక కుటుంబం లాంటివాళ్లం. దీనిని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి’ అని బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలో మెగాస్టార్ వ్యాఖ్యానించారు.

Similar News

News February 2, 2025

ఆ రోజు నుంచి నా టైమ్‌ను 8 నిమిషాలు ముందుకు జరిపా: సచిన్

image

16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్ కోసం రోజూ ఉ.9 గంటలకు హోటల్ నుంచి బస్సు వెళ్లేది. ఓ రోజు నేను ఆలస్యమవడంతో కపిల్ దేవ్ నన్ను పిలిచి ఇప్పుడు 9 అయిందా? అని అడిగారు. అప్పటి నుంచి నా వాచ్‌ టైమ్‌ను 7,8 నిమిషాలు ముందుకు జరిపా. ఆ పర్యటనతో నేనెంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్‌లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

News February 2, 2025

ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ

image

రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.