News September 2, 2024

వివాదంలో ‘కాందహార్’.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం నోటీసులు

image

నసీరుద్దీన్, విజయ్ వర్మ, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించిన ‘IC 814: కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. 1999లో IND విమానాన్ని పాకిస్థాన్ టెర్రరిస్ట్ గ్రూప్ హైజాక్ చేసింది. అందులో పాల్గొన్న నిందితులందరూ ముస్లింలే. కానీ ఈ వెబ్‌సిరీస్‌లో వారి పేర్లను భోళా, శంకర్‌గా మార్చడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్ ఇండియా చీఫ్ మోనికాకు సమన్లు ఇచ్చింది.

Similar News

News November 3, 2025

నవంబర్ 3: చరిత్రలో ఈరోజు

image

*1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి జననం
*1906: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
*1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ జననం
*1937: ప్రముఖ సింగర్ జిక్కి జననం
*1940: విప్లవ రచయిత వరవరరావు జననం
*1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం
*జాతీయ గృహిణుల దినోత్సవం

News November 3, 2025

దీప్తీ శర్మ రికార్డుల మోత

image

ఉమెన్స్ వరల్డ్ కప్: ఫైనల్లోనే కాదు.. టోర్నమెంట్ మొత్తం దీప్తీ శర్మ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. WC నాకౌట్‌లో 58 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌(మెన్స్+ఉమెన్స్)గా చరిత్ర సృష్టించారు. ఉమెన్స్ WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు(22) తీసిన మూడో ప్లేయర్‌గా, ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో 200+ రన్స్, 20+ వికెట్స్ తీసిన తొలి ప్లేయర్‌గా దీప్తి చరిత్ర సృష్టించారు.

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.