News September 2, 2024
వివాదంలో ‘కాందహార్’.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం నోటీసులు
నసీరుద్దీన్, విజయ్ వర్మ, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించిన ‘IC 814: కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. 1999లో IND విమానాన్ని పాకిస్థాన్ టెర్రరిస్ట్ గ్రూప్ హైజాక్ చేసింది. అందులో పాల్గొన్న నిందితులందరూ ముస్లింలే. కానీ ఈ వెబ్‌సిరీస్‌లో వారి పేర్లను భోళా, శంకర్‌గా మార్చడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్ ఇండియా చీఫ్ మోనికాకు సమన్లు ఇచ్చింది.
Similar News
News September 19, 2024
దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్
US ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎనర్జీ, మోటార్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
News September 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.
News September 19, 2024
జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?
జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. NDAకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏ మాత్రం సరిపోదు. అదనంగా సభ్యుల మద్దతు కూడగడితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌సభలో NDAకు 293 మంది సభ్యుల బలం ఉంటే, సవరణల ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే, అదనంగా 43 మంది సభ్యుల బలం అవసరం ఉంది.