News September 2, 2024

ప్రభుత్వమే ఖమ్మంలో ఉంది.. ధైర్యంగా ఉండండి: మంత్రులు

image

TG: భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మంలో 24 గంటల్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి వెల్లడించారు. ‘మున్నేరు పరీవాహక ప్రాంతంలో అతి తక్కువ సమయంలో 46 సెం.మీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని నదులన్నీ ఉప్పొంగాయి. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడతాం. ప్రభుత్వమే ఖమ్మంలో ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి’ అని భరోసా నింపారు.

Similar News

News February 2, 2025

గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడి వద్ద 460 బుల్లెట్లు

image

TG: గచ్చిబౌలి <<15334177>>కాల్పుల కేసులో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో పోలీసులు మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ వద్ద 460 బుల్లెట్లు లభించాయి. బిహార్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ తన సాఫ్ట్ వేర్ స్నేహితుడి గదిలో ఉంటున్నట్లు గుర్తించారు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లిన అతను తోటి ఖైదీని చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

ప్రపంచ జనాభా.. బ్లడ్ గ్రూపుల వారీగా

image

O+: 42 శాతం
A+: 31 శాతం
B+: 15 శాతం
AB+: 5 శాతం
O-: 3 శాతం
A-: 2.5 శాతం
B-: 1 శాతం
AB-: 0.5 శాతం
**మరి మీది ఏ గ్రూప్..? కామెంట్ చేయండి.

News February 2, 2025

SO SAD.. దక్షిణాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్

image

అంతర్జాతీయ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజయం వారికి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేయర్లు కన్నీరుపెట్టుకున్నారు. ఏడాది వ్యవధిలోనే సీనియర్స్ మహిళల, పురుషుల T20 WC ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి WTC ఫైనల్లోనైనా గెలుస్తుందేమో చూడాలి.