News February 2, 2025

గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడి వద్ద 460 బుల్లెట్లు

image

TG: గచ్చిబౌలి <<15334177>>కాల్పుల కేసులో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో పోలీసులు మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ వద్ద 460 బుల్లెట్లు లభించాయి. బిహార్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ తన సాఫ్ట్ వేర్ స్నేహితుడి గదిలో ఉంటున్నట్లు గుర్తించారు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లిన అతను తోటి ఖైదీని చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

News February 17, 2025

టీమ్ ఇండియా ఫొటోషూట్.. పిక్స్ వైరల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఫొటో సెషన్‌లో పాల్గొంది. ఇందులో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు సందడి చేశారు. టీ20 టీమ్, టెస్టు టీమ్ క్యాప్‌లు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై పాకిస్థాన్ అని పేరు రాసి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News February 17, 2025

కుంభమేళాలో నేడు 1.35కోట్ల మంది స్నానాలు

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. దేశ నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది. నేడు త్రివేణీ సంగమంలో 1.35 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 54.31 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగియనుంది.

error: Content is protected !!