News September 3, 2024

AP, TGకి ‘భారతీయ రైల్వే కవచం’

image

ప్రమాదాల నివారణ కోసం భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. AP, TG సహా 12 రాష్ట్రాల్లో 5000 KM మేర కవచ్ ఇన్‌స్టలేషన్ కోసం ఆగస్టులో టెండర్లు ఇచ్చినట్టు తెలిసింది. రూ.2700 కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ అక్టోబర్లో ముగుస్తుంది. ఇన్‌స్టలేషన్‌కు 12-18 నెలలు పట్టనుంది. ట్రాక్ మీద కవచ్ అమర్చేందుకు KMకు రూ.50 లక్షలు, ఒక్కో లోకోమోటివ్‌కు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. 2022 DEC తర్వాత టెండర్లు ఇవ్వడం ఇదే తొలిసారి.

Similar News

News February 2, 2025

భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.

News February 2, 2025

రికార్డులతో ‘అభి’షేకం

image

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గానూ నిలిచారు.

News February 2, 2025

వారిద్దరు రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్

image

TG: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో తమతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.