News February 2, 2025
రికార్డులతో ‘అభి’షేకం

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గానూ నిలిచారు.
Similar News
News April 17, 2026
తగ్గేదేలే.. లూసిఫర్-3 కచ్చితంగా చేస్తా: పృథ్వీరాజ్

ఒకట్రెండు కమిట్‌మెంట్లు పూర్తయిన తర్వాత లూసిఫర్-3ని కచ్చితంగా తీస్తానని నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మోహన్ లాల్ డేట్స్ కుదరడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ‘L2: ఎంపురాన్’ సినిమా కొద్ది మందికి నచ్చకపోయినా తన నిబద్ధత తగ్గదని చెప్పారు. ఆ చిత్రంలో <<15958942>>గుజరాత్ అల్లర్ల ప్రస్తావనపై<<>> స్పందిస్తూ ‘రాజకీయ ప్రయోజనాల కోసం రూ.కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తిని కాదు’ అని స్పష్టం చేశారు.
News April 17, 2026
డీలిమిటేషన్.. పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్

డీలిమిటేషన్ బిల్లులో J&K అసెంబ్లీలో <<19661636>>POKకు 24 సీట్లను<<>> కేంద్రం రిజర్వ్ చేయడాన్ని రెచ్చగొట్టే చర్యగా పాక్ విమర్శించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. భారత సార్వభౌమాధికారంలో భాగంగా పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలపై నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇందులోకి చొరబడే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది.
News April 17, 2026
‘జిమ్’ దుస్తులతో డేంజర్

జిమ్‌కు వెళ్లేవారు కంఫర్ట్ కోసం టైట్‌గా ఉండే సింథటిక్(Activewear) దుస్తులను వాడటం పెరిగింది. అయితే ఆ దుస్తుల్లో వాడే థాలేట్స్ అనే రసాయనాలు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘బ్రీతబిలిటీ లేకపోవడం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగి చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ వస్తాయి. అందువల్ల వదులుగా ఉండే కాటన్ దుస్తులు వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.


