News September 3, 2024

HYD: FIR నుంచి మంత్రుల పేర్ల తొలగింపు.. కోర్టులో పిటిషన్

image

కేంద్ర మంత్రులు అమిత్, కిషన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించడంపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ నాంపల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. 2024 మే 1న ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శాలిబండలో కేసు నమోదైందని, విచారణలో వారు కోడ్ ఉల్లంఘించలేదని పేర్లు తొలగించారు. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 14కు వాయిదా వేసింది.

Similar News

News November 4, 2025

వచ్చేనెలలో పుస్తకాల పండుగ.. నగరం సిద్ధమా?

image

HYDలో బుక్ ఫెయిర్.. ఈ పేరు వింటే చాలు పుస్తక ప్రేమికులు పులకించిపోతారు. ఏటా నగరంలో జరిగే ఈ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ వచ్చేనెలలో జరగబోతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో DEC 19 నుంచి 10 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా సాహితీ చర్చలు, పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, శ్రీనివాస్ తెలిపారు.

News November 4, 2025

మీర్జాగూడ ఘటన.. ఆ గుంత పూడ్చివేత

image

చేవెళ్ల మండలం మీర్జాగూడలో నిన్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి కారణమైన గుంతను అధికారులు ఈరోజు పూడ్చివేసినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతను తప్పించడానికి టిప్పర్ డ్రైవర్ ప్రయత్నించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముందే రోడ్డుకు మరమ్మతులు చేసి ఉంటే అంత మంది ప్రాణాలు పోయేవి కావంటున్నారు.

News November 4, 2025

తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

image

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.