News September 3, 2024
బ్రూనై రాజు విలాసాలు.. హెయిర్ కట్‌కు రూ.16.5 లక్షలు
PM మోదీ నేడు బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజు హస్సనల్ బోల్కియా ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఎక్కువ కాలం పాలించిన రెండో వ్యక్తి. ఆస్తి $30 బిలియన్లపైనే ఉంటుంది. 1700 గదులున్న ఆయన ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌గా పేరొందింది. హెయిర్ కట్ కోసం ప్రైవేటు జెట్‌లో లండన్‌లో ఉన్న బార్బర్ దగ్గరకు వెళతారు. ఇందుకోసం $20వేలు(₹16.5 లక్షలు) వెచ్చిస్తారు.
Similar News
News January 15, 2025
కేటీఆర్‌కు మరోసారి నోటీసులు?
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
News January 15, 2025
‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 15, 2025
BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట
AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.