News September 3, 2024

బ్రూనై రాజు విలాసాలు.. హెయిర్ కట్‌కు రూ.16.5 లక్షలు

image

PM మోదీ నేడు బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజు హస్సనల్ బోల్కియా ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఎక్కువ కాలం పాలించిన రెండో వ్యక్తి. ఆస్తి $30 బిలియన్లపైనే ఉంటుంది. 1700 గదులున్న ఆయన ప్యాలెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌గా పేరొందింది. హెయిర్ కట్ కోసం ప్రైవేటు జెట్‌లో లండన్‌లో ఉన్న బార్బర్ దగ్గరకు వెళతారు. ఇందుకోసం $20వేలు(₹16.5 లక్షలు) వెచ్చిస్తారు.

Similar News

News September 17, 2024

ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.

News September 17, 2024

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌లిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మై చర్చించింది. అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు.

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>