News September 4, 2024
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రీజన్ ఏంటంటే?
బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణాలు. 25,089 వద్ద మొదలైన NSE నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 25,095 వద్ద చలిస్తోంది. BSE సెన్సెక్స్ 511 పాయింట్లు పతనమై 82,026 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 5:45గా ఉంది. ఏషియన్ పెయింట్స్, BPCL, HUL, హీరోమోటో, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
Similar News
News February 3, 2025
సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్
దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
సినిమాల్లోకి మోనాలిసా.. కొత్త PHOTO
కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం’ అంటూ ఆమె Xలో చెప్పుకొచ్చింది. కాగా <<15310417>>‘ది డైరీ ఆఫ్ మణిపుర్’<<>> చిత్రంలో మోనాలిసా నటించనుంది.
News February 3, 2025
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది.