News February 3, 2025
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది.
Similar News
News February 13, 2025
మంచి మాట – పద్యబాట

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.
News February 13, 2025
కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.
News February 13, 2025
కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి

TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.