News September 4, 2024
నెల జీతం విరాళంగా ప్రకటించిన BRS

TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.
Similar News
News November 5, 2025
పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


