News September 4, 2024
నెల జీతం విరాళంగా ప్రకటించిన BRS
TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.
Similar News
News September 9, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 09, సోమవారం
షష్ఠి: రా.9.53 గంటలకు
విశాఖ: సా.6.04 గంటలకు
వర్జ్యం: రా.10.24-రా.12.08 గంటల వరకు
దుర్ముహూర్తం: తెల్లవారుఝామున.12.26- 1.18 గంటల వరకు
మ.2.56-3.45 గంటల వరకు
News September 9, 2024
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్ర చర్యలు: విశాల్
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తెలిపారు. ఈ మేరకు నేడు జరిగిన సంఘం 68వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ‘సంఘం ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది. ఫిర్యాదు వస్తే తప్పు చేసినవారిపై తీవ్ర చర్యలుంటాయి’ అని వివరించారు. మహిళలకు ధైర్యాన్నిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని సంఘం ట్రెజరర్ నాజర్ పేర్కొన్నారు.
News September 9, 2024
TODAY HEADLINES
➣AP: బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం: CBN
➣AP: అతి భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
➣TG: జర్నలిస్టులకు భూమి పత్రాలు అందించిన CM రేవంత్
➣బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్
➣పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన CBN: కురసాల
➣TG:కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం: హైడ్రా కమిషనర్
➣ ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో పేదల ఇళ్లు: KTR
➣31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్