News September 6, 2024
EV సంస్థలకు సబ్సిడీ అవసరం లేదు: గడ్కరీ
వినియోగదారులు ఇప్పుడు సొంతంగా EV లేదా CNG వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో EV తయారీదారులకు ఇక సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీజిట్, పెట్రోల్ వాహనాల కంటే ఈవీలపై జీఎస్టీ తక్కువన్నారు. రాయితీ అడగడం ఇక ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28%, EVలపై 5% GST ఉందన్నారు.
Similar News
News January 15, 2025
మందుబాబులకు GOOD NEWS
AP: సంక్రాంతి వేళ మందుబాబులకు లిక్కర్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలు తగ్గించగా, మరిన్ని బ్రాండ్ల రేట్లను తగ్గించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మాన్షన్ హౌస్ క్వార్టర్‌పై రూ.30, అరిస్టోక్రాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ రూ.50, కింగ్‌ఫిషర్ బీర్ రూ.10, బ్యాగ్‌పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీపై రూ.80 తగ్గించాయి. కొత్త ధరలతోనే షాపులకు మద్యం సరఫరా చేస్తున్నాయి.
News January 15, 2025
430 విజయాలు.. చరిత్ర సృష్టించిన జకోవిచ్
ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యధిక మ్యాచ్‌లు(430) గెలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్‌లు ఉన్నాయి.
News January 15, 2025
పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట
తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.