News September 6, 2024
EV సంస్థలకు సబ్సిడీ అవసరం లేదు: గడ్కరీ
వినియోగదారులు ఇప్పుడు సొంతంగా EV లేదా CNG వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో EV తయారీదారులకు ఇక సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీజిట్, పెట్రోల్ వాహనాల కంటే ఈవీలపై జీఎస్టీ తక్కువన్నారు. రాయితీ అడగడం ఇక ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28%, EVలపై 5% GST ఉందన్నారు.
Similar News
News September 15, 2024
SHOCKING: అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ నిషేధం?
అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్‌కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
News September 15, 2024
ఆ గ్రహశకలం వచ్చేది నేడే!
ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్లనుందని నాసా చాలారోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్టరాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దాని వల్ల భూమికి ముప్పు లేనట్లేనని నాసా క్లారిటీ ఇచ్చింది.
News September 15, 2024
జగన్‌పై ద్వేషంతో చంద్రబాబు ఇలా చేయడం అన్యాయం: రోజా
AP: జగన్‌పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతో సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవడం అన్యాయమని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. ‘గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పులివెందుల కాలేజీకి కేటాయించిన సీట్లను రద్దు చేయాలని NMCకి లేఖ రాయడం దుర్మార్గం. YCP పాలనలో నిర్మించిన కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.