News September 6, 2024
ఘోరం: ఒలింపిక్ అథ్లెట్‌ను చంపేసిన మాజీ ప్రియుడు

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబక్కా చెప్టెగీ(33)ను మాజీ బాయ్‌ఫ్రెండ్ చంపేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 75 శాతానికిపైగా శరీరం కాలిపోయింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెబక్కా తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, గొప్ప అథ్లెట్‌ను కోల్పోయామని ఆ దేశ ఒలింపిక్ కమిటీ చీఫ్ డొనాల్డ్ రుకారే చెప్పారు. నిందితుడిని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News January 25, 2026
JNCASRలో ఉద్యోగాలు

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<
News January 25, 2026
సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.
News January 25, 2026
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


