News September 6, 2024
ఘోరం: ఒలింపిక్ అథ్లెట్‌ను చంపేసిన మాజీ ప్రియుడు

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబక్కా చెప్టెగీ(33)ను మాజీ బాయ్‌ఫ్రెండ్ చంపేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 75 శాతానికిపైగా శరీరం కాలిపోయింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెబక్కా తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, గొప్ప అథ్లెట్‌ను కోల్పోయామని ఆ దేశ ఒలింపిక్ కమిటీ చీఫ్ డొనాల్డ్ రుకారే చెప్పారు. నిందితుడిని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News July 10, 2025
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి అవుట్ ఫ్లో వస్తుండడంతో నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటకు గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుందని వెల్లడించారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
News July 10, 2025
PHOTO GALLERY: ‘మెగా PTM’లో CBN, లోకేశ్

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పిల్లలకు సీఎం పాఠాలు చెప్పారు. సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంబంధించి వారు Xలో ఫొటోలు షేర్ చేశారు.
News July 10, 2025
ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.