News September 7, 2024

హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్!

image

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Similar News

News March 21, 2026

దాడులు ఆపండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ

image

పశ్చిమాసియాలో 20 రోజులుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ 22 దేశాలు ఇరాన్‌కు లేఖ రాశాయి. ఈ జాబితాలో UAE, UK, బహ్రెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలున్నాయి. గల్ఫ్ రీజియన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దాడులను ఆపాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నాయి.

News March 21, 2026

ఇరాన్‌కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

image

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్‌ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్‌లో షియా, పాక్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువ.

News March 21, 2026

వారంలో ఐపీఎల్.. ఆ ప్లేయర్లు ఆడటం డౌటే!

image

వారంలో IPL మొదలవనుండగా తమ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు మెలిక పెట్టింది. ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేందుకు NOC ఇవ్వాలంటే ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసవ్వాలని స్పష్టం చేసింది. DC ప్లేయర్లు చమీరా, నిస్సంక, కమిందు మెండిస్(SRH) ఫిజికల్ టెస్టును క్లియర్ చేశారు. గాయాల పాలైన హసరంగ(LSG), నువాన్ తుషార(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH) ఇంకా టెస్టులో పాల్గొనలేదు. దీంతో వీరు IPLలో పాల్గొనడంపై అనుమానం నెలకొంది.