News September 8, 2024
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే విందులు చేసుకున్నావ్: టీడీపీ

AP: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే మాజీ CM జగన్ హైదరాబాద్‌లో విందులు, వినోదాల్లో మునిగితేలారని టీడీపీ ఆరోపించింది. ప్రజలను నువ్వు ఆదుకోవు, ఇతరులను ఆదుకోనివ్వవు అని ట్విటర్‌లో విమర్శించింది. ‘నీ అడ్రస్ గల్లంతు చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు. ఎప్పటికైనా లండన్‌లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి ఆలోచించే గుణం నీకెక్కడిది? నీదంతా కుళ్లు, కుతంత్రాలు, శవ రాజకీయాలు’ అని మండిపడింది.
Similar News
News September 17, 2025
విశాఖలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

రుషికొండలోని రాడీసన్ బ్లూ హోటల్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.
News September 17, 2025
స్మృతి మంధాన సూపర్ సెంచరీ

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.