News September 8, 2024
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే విందులు చేసుకున్నావ్: టీడీపీ

AP: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే మాజీ CM జగన్ హైదరాబాద్లో విందులు, వినోదాల్లో మునిగితేలారని టీడీపీ ఆరోపించింది. ప్రజలను నువ్వు ఆదుకోవు, ఇతరులను ఆదుకోనివ్వవు అని ట్విటర్లో విమర్శించింది. ‘నీ అడ్రస్ గల్లంతు చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు. ఎప్పటికైనా లండన్లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి ఆలోచించే గుణం నీకెక్కడిది? నీదంతా కుళ్లు, కుతంత్రాలు, శవ రాజకీయాలు’ అని మండిపడింది.
Similar News
News July 6, 2025
గుంటూరు: లోక్ అదాలత్లో 10,698 కేసులు పరిష్కారం

గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న రాజీ సాధ్యమైన కేసులను పరిష్కరించారు. వాటిలో సివిల్ కేసులు 1,041, క్రిమినల్ 9,580, ప్రీలిటిగేషన్ 77, మొత్తం 10,698 కేసులు ఉన్నాయి. పరిష్కరించిన కేసుల విలువ మొత్తం రూ.50.96 కోట్లు ఉందని జడ్జి చక్రవర్తి తెలిపారు.
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.