News September 8, 2024
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 10, 2025
బస్సు టికెట్ రూ.6వేలు, ఫ్లైట్ టికెట్ రూ.15వేలు
సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 10, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్
టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
News January 10, 2025
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వివరించారు.