News September 8, 2024

ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 10, 2024

బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు

image

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్‌గ‌ఢ్ బీజేపీ నేత‌ల్ని మావోయిస్టులు హెచ్చ‌రించారు. పార్టీ విస్త‌ర‌ణ చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబ‌ర్‌షిప్ డ్రైవ్‌ నిలిచిపోయింది.

News October 10, 2024

నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్

image

తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులో తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘భారత్ అనేక సంస్కృతులకు నిలయం. దేశవ్యాప్తంగా ప్రయాణించి అవన్నీ తెలుసుకోవాలని, ప్రజలతో మమేకమవ్వాలని చెప్పాను. ఏ స్కూల్, కాలేజీ చెప్పని అంశాలు ఈ ప్రయాణంలో తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.

News October 10, 2024

గాజాలో పరిస్థితుల్ని చక్కదిద్దండి: ఇజ్రాయెల్‌కు అమెరికా సూచన

image

గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయంటూ అమెరికా తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసరంగా ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలని సూచించింది. ‘మానవతా సాయాన్ని అడ్డుకోవడాన్ని ఇజ్రాయెల్ మానుకోవాలి. గాజా ప్రజల వేదనను తగ్గించేందుకు సహకరించాలి. యుద్ధకాలం దాటిపోయింది. ఇది హమాస్‌తో ఒప్పందానికి వచ్చి ఇజ్రాయెల్ పౌరుల్ని ఇంటికి తెచ్చుకునే సమయం’ అని UNలో అమెరికా స్పష్టం చేసింది.