News September 9, 2024

నేడు జీఎస్టీ కౌన్సిల్ 54వ స‌మావేశం

image

ఈ రోజు GST కౌన్సిల్ 54వ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ట‌ర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్‌టీ మిన‌హాయింపు, స్లాబ్ మార్పుల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక GST కాంపెన్సేషన్ సెస్‌ కొనసాగింపుపై స్పష్టత వ‌చ్చే అవకాశం ఉంది. సెస్‌ను ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం.

Similar News

News November 5, 2025

ఇంటి చిట్కాలు

image

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.

News November 5, 2025

రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

image

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

News November 5, 2025

ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించవచ్చా?

image

దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే దీపాన్ని మరో దీపంతో వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోనే తిరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇలా చేస్తే మొదటి దీపం ఆకర్షించిన ప్రతికూలత రెండవ దీపానికి చేరుతుంది. దీనివల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మీ చుట్టూర వ్యాపిస్తుంది. ఇలా జరగకూడదన్నా, అశుభ సంఘటనల నుంచి బయటపడలన్నా ఈ తప్పు చేయకూడదు’ అని సూచిస్తున్నారు.