News September 9, 2024
నేడు జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం
ఈ రోజు GST కౌన్సిల్ 54వ సమావేశం జరగనుంది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయింపు, స్లాబ్ మార్పులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక GST కాంపెన్సేషన్ సెస్ కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెస్‌ను ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
Similar News
News October 11, 2024
GOOD NEWS.. వారికి బోనస్
కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.
News October 11, 2024
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు
TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.