News September 11, 2024

పడవలను తొలగించేందుకు ఎయిర్ బెలూన్లు

image

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 40 టన్నుల చొప్పున బరువున్న 3 బోట్లను కలిపి కట్టడంతో అవి 120 టన్నులు అయ్యాయి. 50 టన్నుల బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా అవి కదల్లేదు. దీంతో పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు బోట్లను తొలగించనున్నారు.

Similar News

News January 12, 2026

పనసలో కాయకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజిం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.

News January 12, 2026

ఇంటి క్లీనింగ్ చిట్కాలు

image

* వెనిగర్, మొక్కజొన్న పిండి, నీరు కలిపి కార్పెట్ల మీద చల్లి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు గిన్నెలో వేసి మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు శుభ్రం చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా, నీరు కలిపాలి. ఈ మిశ్రమాన్ని చల్లి అరగంటాగి శుభ్రం చేస్తే సరిపోతుంది.

News January 12, 2026

ఈ OTTలోనే ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ స్ట్రీమింగ్!

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిన్న ప్రీమియర్స్‌తో రిలీజైన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ‘ZEE5’ దక్కించుకోగా శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే ఇది OTTలో స్ట్రీమింగ్ కానుంది. అనంతరం బుల్లితెరపై సందడి చేయనుంది. మీరూ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.