News September 11, 2024

పడవలను తొలగించేందుకు ఎయిర్ బెలూన్లు

image

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 40 టన్నుల చొప్పున బరువున్న 3 బోట్లను కలిపి కట్టడంతో అవి 120 టన్నులు అయ్యాయి. 50 టన్నుల బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా అవి కదల్లేదు. దీంతో పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు బోట్లను తొలగించనున్నారు.

Similar News

News October 5, 2024

Exit Polls: హరియాణాలో కాంగ్రెస్‌దే గెలుపు

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచ‌నా వేసింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46-50 సీట్లు సాధించ‌నున్న‌ట్టు స‌ర్వే ఫలితాలు అంచనా వేశాయి. అలాగే అధికార బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఆ పార్టీకి కేవ‌లం 20-32 సీట్లు ద‌క్క‌నున్న‌ట్టు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు దక్కనున్నట్లు పేర్కొంది.

News October 5, 2024

EXIT POLLS: జమ్మూకశ్మీర్‌లో అధికారం ఎవరిదంటే?

image

J&K ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేసింది. NC 33-35, కాంగ్రెస్ 13-15 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. బీజేపీ 23-27 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. అయితే మేజిక్ ఫిగర్ 46ను అందుకోలేక INC+NC 35-40 స్థానాలే గెలుస్తాయని దైనిక్ భాస్కర్, 43 సీట్లకే పరిమితమై హంగ్ ఏర్పడొచ్చని NDTV సర్వే వెల్లడించింది.

News October 5, 2024

నా వల్ల తలెత్తిన ఇబ్బందులు పరిష్కరిస్తా: కొలికపూడి

image

AP: తన వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తన పని తీరు వల్ల క్యాడర్‌లో సమన్వయ లోపం ఏర్పడిందని, ఆ ఇబ్బందులను తానే సరిదిద్దుకుంటానని చెప్పారు. అమరావతిలో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని, వర్ల రామయ్యతో ఆయన భేటీ అయ్యారు. కాగా రేపు పార్టీ పెద్దల ఆధ్వర్యంలో తిరువూరులో సమావేశం నిర్వహిస్తున్నారు.