News September 11, 2024
కాఫీతో గుండెజబ్బుల ముప్పు

ఆహారం మితంగా తింటే అమృతం. అపరిమితంగా తింటే విషం. కాఫీ విషయంలోనూ ఇదే నిజం. ఎక్కువ రోజులు 400mg మించి కెఫిన్ తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయని ACC రీసెర్చ్ పేర్కొంది. ఇది 4 కప్పుల కాఫీ, 2 ఎనర్జీ డ్రింక్స్, 10 సీసాల సోడాకు సమానమంది. ఇతర డ్రింక్స్‌లో కలిపి కెఫిన్ తీసుకున్నా ఒక్కసారిగా బీపీ పెరిగి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని కార్డియాలజిస్ట్ జేసన్ హాపర్ అన్నారు.
Similar News
News November 12, 2025
ఏపీ ఎడ్యుకేషన్&జాబ్స్ న్యూస్

* MBBS బీ, సీ కేటగిరీ సీట్లకు మూడో దశకు కౌన్సెలింగ్‌కు ఇవాళ సా.4 గంటల్లోపు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
* జర్మనీకి చెందిన యూరోప్ కెరీర్స్‌తో APSSDC, ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోప్ సంస్థ ఏపీ యువతకు జర్మన్ భాషలో శిక్షణ, ఉద్యోగాలను అందిస్తుంది. జాబ్ కాంట్రాక్ట్, వీసా సమకూర్చడానికి సాయం చేస్తుంది.
News November 12, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.
News November 12, 2025
హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.


