News September 11, 2024
‘దేవర’ సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.57 గంటలుగా ఉంది. కాగా ఈ నెల 27న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో 55 మిలియన్లకు పైగా వ్యూస్తో రికార్డు క్రియేట్ చేసింది.
Similar News
News July 7, 2025
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం: అచ్చెన్న

AP: మాజీ సీఎం జగన్ రైతు ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము మిర్చి, మామిడి, కోకో, పొగాకు రైతులకు న్యాయం చేశామని వివరించారు. జగన్ను నిలదీయాలని రైతులకు మంత్రి సూచించారు.
News July 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 7, 2025
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ

తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.