News September 11, 2024

‘దేవర’ సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.57 గంటలుగా ఉంది. కాగా ఈ నెల 27న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.

Similar News

News October 5, 2024

నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం

image

నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 5, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.

News October 5, 2024

ధాన్యం సేకరణపై సీఎం కీలక నిర్ణయం

image

AP: ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.