News September 12, 2024
పవన్ కళ్యాణ్ చొరవ.. 7 నెలల తర్వాత జీతాలు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News August 27, 2025
GST రేట్స్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడా..!

GST శ్లాబులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, US టారిఫ్స్ ప్రభావం పడకుండా ఎకానమీని స్థిర పరచాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న పరిస్థితి తలెత్తొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నులు తగ్గేంత మేర ఉత్పత్తుల ధరలు <<17529810>>పెంచాలని<<>> బీమా, సిమెంటు సహా కొన్ని కంపెనీలు భావిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై కేంద్రం ముందే నిఘా పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.
News August 27, 2025
కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
News August 27, 2025
రోహిత్‌కు బౌలింగ్ వేయడం కష్టం: వుడ్

తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వెల్లడించారు. ‘రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతుల్ని బౌండరీలకు తరలిస్తారు. అతడి ఆటను చూస్తే బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కోహ్లీ, పంత్‌కు బౌలింగ్ చేయడం కూడా సవాలే. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.