News September 12, 2024

పవన్ కళ్యాణ్ చొరవ.. 7 నెలల తర్వాత జీతాలు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 25, 2026

JNCASRలో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<>JNCASR<<>>) 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.jncasr.ac.in

News January 25, 2026

సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

image

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.

News January 25, 2026

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

image

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.