News September 12, 2024
నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ పనులు వద్దు: బంగ్లా

ముస్లిములు నమాజ్, అజాన్ చేసేటప్పుడు దుర్గా మండపాల వద్ద 5 నిమిషాల ముందే మైకులు, స్పీకర్లు ఆఫ్ చేయాలని బంగ్లాదేశ్ హోమ్ అఫైర్స్ అడ్వైజర్ జహంగీర్ ఆలమ్ అన్నారు. ఇందుకు పూజా కమిటీలు అంగీకరించాయని తెలిపారు. ‘ఈ ఏడాది 32,666 పూజా మండపాలు వెలుస్తాయి. విగ్రహాల తయారీ దశ నుంచే ఎలాంటి కలహాలు చెలరేగకుండా 24 గంటల భద్రతకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు జరుపుకొనే అతిపెద్ద పండుగ ఇదే.
Similar News
News December 4, 2025
లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల సంఖ్యను పెంచుదాం, ఆడ-మగ సమతుల్యాన్ని సాధిద్దాం అన్నారు. పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
News December 4, 2025
పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

TG: భూకబ్జా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో 70 మంది బౌన్సర్లతో వచ్చి ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారని, అడ్డుకున్న తమపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు FIR ఫైల్ చేశారు. NOV 30న ఘటన జరగగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై తాజాగా కేసు నమోదైంది.
News December 4, 2025
ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్‌లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్‌లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.


