News September 12, 2024
నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ పనులు వద్దు: బంగ్లా
ముస్లిములు నమాజ్, అజాన్ చేసేటప్పుడు దుర్గా మండపాల వద్ద 5 నిమిషాల ముందే మైకులు, స్పీకర్లు ఆఫ్ చేయాలని బంగ్లాదేశ్ హోమ్ అఫైర్స్ అడ్వైజర్ జహంగీర్ ఆలమ్ అన్నారు. ఇందుకు పూజా కమిటీలు అంగీకరించాయని తెలిపారు. ‘ఈ ఏడాది 32,666 పూజా మండపాలు వెలుస్తాయి. విగ్రహాల తయారీ దశ నుంచే ఎలాంటి కలహాలు చెలరేగకుండా 24 గంటల భద్రతకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు జరుపుకొనే అతిపెద్ద పండుగ ఇదే.
Similar News
News October 10, 2024
ఈరోజు సెలవా? కాదా?
తెలంగాణలో ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నేడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. అయితే సాధారణ సెలవు ఇవ్వాలని CMO ముఖ్య కార్యదర్శికి తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు మాత్రమే ఉండనుంది.
News October 10, 2024
అల్విదా రతన్‌జీ.. ఓ శకం ముగిసింది
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65% నిధులను దాతృత్వానికే వెచ్చించారు. లేదంటే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన తొలి వరుసలో ఉండేవారు. కానీ అవేమీ లెక్కచేయని గొప్ప మానవతావాది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అల్విదా రతన్‌జీ.
News October 10, 2024
రెండు మద్యం షాపులకు తీవ్ర పోటీ.. ఎక్కడంటే?
AP: మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులొచ్చాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు, రేపు కూడా అవకాశం ఉండటంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా. NTR(D) వత్సవాయి(M)లో 2 దుకాణాలకు అత్యధికంగా 217(రూ.4.2 కోట్లు) దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా NTR(D)లో 4,420, ఏలూరు(D)లో 3,843, విజయనగరం(D)లో 3,701 దరఖాస్తులు అందాయి.