News September 12, 2024
ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం

AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.
Similar News
News August 28, 2025
సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
News August 28, 2025
మెదక్, కామారెడ్డి జిల్లాలో రేపు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు మెదక్ జిల్లాలో సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇచ్చింది. అటు కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD HYD తెలిపింది. దీంతో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరి మీ ప్రాంతంలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.
News August 28, 2025
US సాఫ్ట్ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

టారిఫ్స్ పెంచి భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్‌ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్‌లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్‌ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.