News September 12, 2024
ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం

AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.
Similar News
News November 15, 2025
తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకొని హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా తండ్రితో కలిసి చేసిన మూవీలో ఓ స్టిల్‌ను షేర్ చేసుకున్నారు. ‘ఇవాళ మిమ్మల్ని కాస్త ఎక్కువగానే మిస్ అవుతున్నాను. నాన్నా మీరు ఉండి ఉంటే గర్వపడేవారు’ అని ట్వీట్ చేశారు. ఇది చూసి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ‘ఆయన్ను మీరు ఎప్పుడో గర్వపడేలా చేశారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
News November 15, 2025
CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి రుతురాజ్‌కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.
News November 15, 2025
అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


