News September 13, 2024
హరీశ్ రావుకు వైద్య పరీక్షలు

TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
News November 11, 2025
దేవుడి గురించి అడిగిన ధర్మరాజు

యుధిష్టిర ఉవాచ :
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
భావం: లోకంలో దైవమనగా నేమి? ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానం ఏది? ఏ దేవుని స్తుతించుట వల్ల, పూజించుట వల్ల మానవులు శుభాలను పొందుతారు.
ఈ శ్లోకం భగవంతుని ఏకత్వాన్ని, మానవ జీవితానికి లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను తెలుపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 11, 2025
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో PO ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.southindianbank.bank.in


