News September 13, 2024
హరీశ్ రావుకు వైద్య పరీక్షలు
TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
Similar News
News October 9, 2024
పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్?
పాకిస్థాన్ టీమ్‌కు ICC బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. UAE, శ్రీలంక, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట టోర్నీ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు పాక్ ఆవల నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్. BCCI అంగీకరిస్తే పాక్‌లోనే టోర్నీ ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 9, 2024
ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం
AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.