News September 13, 2024
వ్యాపారవేత్తకు అన్నామలై క్షమాపణలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.
Similar News
News September 20, 2025
బొప్పాయిలో మొజాయిక్ వైరస్ లక్షణాలు

బొప్పాయి తోటల్లో మొజాయిక్ వైరస్ విత్తనం, పేను ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పూర్తిగా ఆకు పసుపు రంగుకు మారుతుంది. అందుకే దీనిని పల్లాకు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు ముడుచుకుపోయి పెళుసుగా మారతాయి. మొక్కలు సరిగా ఎదగవు. బలహీనంగా కనిపిస్తాయి. కాయల్లో నాణ్యత ఉండదు. పండ్లు చిన్నవిగా, వికృతంగా తయారవుతాయి.
News September 20, 2025
బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
News September 20, 2025
మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.