News September 13, 2024

వ్యాపారవేత్తకు అన్నామలై క్షమాపణలు

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.

Similar News

News October 4, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్ స్పందన

image

మంత్రి కొండా సురేఖ <<14254371>>వ్యాఖ్యలపై<<>> ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. ప్రజలచే ఎన్నుకోబడిన నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు.

News October 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 4, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 4, శుక్రవారం
విదియ: తె.5.30 గంటలకు
చిత్త : సా.6.37 గంటలకు
వర్జ్యం: రా.12.54 నుంచి రా.2.42 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుంచి ఉ.9.09 గంటల వరకు
(2) మ.12.19 నుంచి మ.1.07 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు