News September 15, 2024

రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత

image

FY2022-23లో ₹1.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత జరగగా, FY2023-24లో ఆ మొత్తం ₹2.01 లక్షల కోట్లుగా నమోదైనట్లు DGGI వెల్లడించింది. ఆన్‌లైన్ గేమింగ్‌ రంగంలో అత్యధికంగా ₹81,875cr ఎగవేత జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(₹18,961cr), ఖనిజాలు(₹16,806cr), పొగాకు, సిగరెట్ ఉత్పత్తులు(₹5,794cr), కాంట్రాక్టు సర్వీసెస్(₹3,846cr) రంగాలు ఉన్నాయని పేర్కొంది.

Similar News

News September 19, 2024

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం: ఎన్ని రోజులంటే?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయి.

News September 19, 2024

స్కిల్ యూనివర్సిటీకి సహకరించండి: రేవంత్

image

TG: స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని CM విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.

News September 19, 2024

‘లారెన్స్ బిష్ణోయ్‌ని పిలవాలా?’.. సల్మాన్ తండ్రిని బెదిరించిన మహిళ

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను ఓ మహిళ బెదిరించింది. ముంబైలోని కార్టర్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ ఆయనను అడ్డగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్‌ని పిలవాలా?’ అంటూ ఆమె బెదిరించింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, కామెడీగా అలా అన్నట్లు వారు తెలిపారు. గతంలో సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.