News September 16, 2024
మోదీజీ.. RR ట్యాక్స్‌పై చర్యలేవీ?: KTR
తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిపై చర్యలేవి అంటూ PM మోదీని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో అడిగారు. ‘మీరు RR ట్యాక్స్ గురించి మాట్లాడి 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తుందని మీరు అంటారు. మీ సహచరులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం నోరెత్తరు. వారు మీతో ఏకీభవించరా? లేక మీ విమర్శ ఎన్నికల స్టంటా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 30, 2024
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి
APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.
News December 30, 2024
అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం: సత్య నాదెళ్ల
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తెలిపారు. HYDలో ఆయనతో సీఎం రేవంత్ బృందం భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి HYDను ప్రపంచంలోని టాప్-50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నందుకు ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
News December 30, 2024
భారత్‌కు WTC ఫైనల్ అవకాశాలు ఉన్నాయా?
బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత జట్టు WTC ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా తర్వాతి టెస్టులో గెలవాలి. మరోవైపు AUSతో జరిగే టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. దీంతో పర్సంటేజ్ పరిగణనలోకి తీసుకుంటే భారత్ ఫైనల్ చేరనుంది. భారత్ నెక్స్ట్ టెస్టులో గెలిచినా శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ డ్రాగా ముగిస్తే కనుక ఫైనల్ చేరే అవకాశాలు తక్కువే. మరోవైపు వచ్చే టెస్టులో భారత్ ఓడినా, డ్రా చేసుకున్నా ఫైనల్ చేరదు.