News September 16, 2024

మోదీజీ.. RR ట్యాక్స్‌పై చర్యలేవీ?: KTR

image

తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిపై చర్యలేవి అంటూ PM మోదీని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో అడిగారు. ‘మీరు RR ట్యాక్స్ గురించి మాట్లాడి 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తుందని మీరు అంటారు. మీ సహచరులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం నోరెత్తరు. వారు మీతో ఏకీభవించరా? లేక మీ విమర్శ ఎన్నికల స్టంటా?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 12, 2024

పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.

News October 12, 2024

మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.

News October 12, 2024

జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు

image

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్‌, రెస్ట్ రూమ్‌, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.